

నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, మంగళగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతానని మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నారా లోకేశ్ తెలిపారు. ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలు కోరిన శాశ్వత భూహక్కు హామీని నెరవేర్చుతూ తొలి దశలో 3 వేల మందికి, రెండో దశలో మరో 3 వేల మందికి పట్టాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో ఏళ్లుగా నివసిస్తున్న పేదలకు ఇకపై ఇళ్ల తొలగింపు భయం ఉండదని, శాశ్వత హక్కు కల్పిస్తున్నామని తెలిపారు.
మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. భూగర్భ డ్రైనేజీ, ఇంటింటికీ కుళాయి, తాగునీటి ప్రాజెక్టుల పనులను ఎన్నికల నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్ల తవ్వకాల వల్ల సమస్యలు ఏర్పడ్డాయని, డ్రైనేజీ పనులు పూర్తయిన తర్వాత శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులు తమకు భద్రత, సొంత ఇంటి కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!