
క్రీడలు

కర్ణాటకలోని మైసూరు జిల్లా హుణసూరు పట్టణంలోని న్యూ మారుతి లేఅవుట్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. హరీశ్ (49) అనే వ్యక్తి తన భార్య నిశ్చిత (36), ఇద్దరు పిల్లలు (13, 6)లను హత్య చేసి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భార్య, పిల్లల నోటికి ప్లాస్టర్ అంటించి, గొంతు నులిమి హత్య చేసిన అనంతరం హరీశ్ ఉరి వేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.
ఘటనకు మూడు రోజుల ముందు హరీశ్ తన తల్లిని అమ్మమ్మ ఇంటికి పంపించినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం ఇంటి తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా నలుగురి మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని హుణసూరు పోలీసులు తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!