

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరగడంతో తిరుపతిలోని మూడు కేంద్రాల్లో బుధవారం జారీ చేయాల్సిన సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్లను అధికారులు రద్దు చేశారు. గురువారం దర్శనానికి సంబంధించిన టోకెన్లను నిలిపివేయగా, శుక్రవారం దర్శనానికి గురువారం మధ్యాహ్నం నుంచి యథావిధిగా టోకెన్ల జారీ కొనసాగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఎస్‌ఎస్‌డీ టోకెన్ల రద్దు వరుసగా నాలుగో వారం కావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం దర్శనాల కోసం మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకే 10 వేల టోకెన్లు జారీ చేయగా, శ్రీవారి మెట్టు మార్గంలో మరో 2 వేల టోకెన్లు అందించారు. గంటలోపే టోకెన్ల కోటా పూర్తవడంతో పలువురు భక్తులు కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వచ్చింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ముందస్తు సమాచారం లేకుండా టోకెన్లు రద్దు చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!