

ఇండస్ట్రీయల్ పాలసీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. ఈ పాలసీపై కృషి చేస్తున్నప్పటికీ, కేటీఆర్ దుష్ప్రచారం చేస్తోన్నారని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ ఆలోచనలో మార్పు రావడం లేదని మంత్రి స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం ఆర్థిక అరాచకాలకు పాల్పడిందని ఆయన దుయ్యబట్టారు. “లీజ్ భూములను ఫ్రీ హోల్డ్‌లోకి మార్చాలన్న జీవోలను గత ప్రభుత్వం తీసుకువచ్చింది. ఫ్రీ హోల్డ్ భూములకు ఇన్ఫాక్ట్ ఫీజు కట్టాలని ప్రయత్నం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. కేటీఆర్ చెప్పే 30 శాతం భూమి విలువ కాదు… కేవలం కన్వర్షన్ ఫీజు మాత్రమే. ఫ్రీ హోల్డ్‌కు లీజు భూముల లింక్ లేదు,” అని ఆయన వివరించారు.
అడ్డగోలుగా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి అన్నారు. భూమి కన్వర్షన్ ద్వారా రాజకీయ ప్రోత్సాహం చేస్తున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేక భూములను కన్వర్షన్ చేసినట్లు తెలిపారు. పరిశ్రమలకు పెట్టుబడులు రాకుండా, బెదిరింపుల ద్వారా కేటీఆర్ రాజకీయ ప్రయోజనాలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. పరిశ్రమలు కావాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవచ్చని, కేటీఆర్ చెప్పే పేర్లలో ఉన్నవారు ప్రభుత్వంలో లేరని స్పష్టం చేశారు.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!