

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని, కాంగ్రెస్‌ను ప్రజలు రాజకీయంగా తిరస్కరిస్తారని అన్నారు. పార్లమెంట్‌లో బీఆర్ఎస్ లేకపోవడం వల్ల తెలంగాణ తరఫున గళం వినిపించడంలో లోటు స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావాన్ని అవమానించేలా వ్యాఖ్యలు వచ్చినప్పుడు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్న “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టుపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ఉన్న నగరంలోనే సరైన సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వం కొత్త నగరాన్ని ఎలా నిర్మిస్తుందని ప్రశ్నించారు. మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం బీఆర్ఎస్ హయాంలోనే ప్రారంభమైందని, అనేక ప్రాంతాల్లో ఎస్‌టీపీలు ఏర్పాటు చేశామని చెప్పారు. GHMC ఎన్నికల్లో సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!