

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం మళ్లీ కూలిపోవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అంకారాలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ముగిసిందని ప్రకటించారు. చర్చలు కొనసాగవచ్చని చెప్పినప్పటికీ, వాటి ద్వారా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. మరోవైపు అమెరికా తాజా దాడులు పరస్పర అవగాహన ఒప్పందానికి విరుద్ధమని ఇరాన్ ఆరోపించింది.
తాజా దాడులతో హర్ముజ్ జలసంధి ప్రాంతంలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు క్షిపణులు, డ్రోన్లు, వైమానిక దాడులతో పరస్పరం దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా మళ్లీ ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరిగాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో భారీ ఒడిదుడుకులు కనిపించగా, భారత మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం పడింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!