

భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ వసతి గదుల బుకింగ్ వ్యవహారంలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. టీటీడీ కి చెందిన రూ.1,000 విలువైన గదులను అగోడ (Agoda) వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో రూ.18 వేల వరకు విక్రయిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఆదిత్య బిర్లా, పాంచజన్యం, వకుళమాత గెస్ట్ హౌస్‌ల గదులు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయని పేర్కొంటూ సంబంధిత వీడియో ఆధారాలను కూడా విడుదల చేశారు. నకిలీ బుకింగ్ యాప్‌ల నియంత్రణలో టీటీడీ ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు.
లోపాలను ఎత్తిచూపితే తమపైనే విమర్శలు చేస్తున్నారని భూమన ఆరోపించారు. తమ హయాంలో 48 నకిలీ వెబ్‌సైట్లను మూసివేయించామని గుర్తు చేస్తూ, ప్రస్తుతం భక్తులు మోసపోతున్నా తగిన చర్యలు కనిపించడం లేదన్నారు. నవనీతమ్మ దర్శనం వ్యవహారంలో ముఖ్యమంత్రి, టీటీడీ చైర్మన్ వ్యాఖ్యల్లో భిన్నతలు ఉన్నాయని పేర్కొంటూ, పూర్తి వివరాల కోసం సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నకిలీ యాప్‌లపై విజిలెన్స్ మరింత కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!