
న్యూస్

హైదరాబాద్లో జరిగిన ట్రేడ్ యూనియన్ సభలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విమానయాన రంగంలో ఒకరిద్దరి చేతుల్లోనే అధికారం, పెట్టుబడి ఉంటే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని, ప్రస్తుత ఇండిగో సంక్షోభాన్ని ఉదాహరణగా చూపారు. డీజీసీఏ ఏడాది క్రితమే పైలట్లకు రెస్ట్ ఇవ్వాలని ఆదేశించినా, ఇండిగో-టాటా సమూహం పెడచెవిన పెట్టడంతోనే ఇప్పుడు ఫ్లైట్స్ రద్దు, ఆలస్యాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
అధికారం, సంపద, సంస్థలు కొందరి చేతుల్లోనే ఉంటే జరిగే అనర్థాలకు ఇదే నిదర్శనమని, కేంద్రం కూడా ఇండిగో రచ్చ చేసిన తర్వాతే తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!