
టెక్నాలజీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. టి. రామారావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. సిరిసిల్ల నేతన్నలపై రాజకీయ కోపాన్ని చూపించొద్దని వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో జరిగిన బీఆర్‌ఎస్ సమావేశంలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను రద్దు చేసిందని, బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేయడంతో నేతన్నలు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు.
రైతులకు గన్నీ సంచులు కూడా లేవని, ప్రభుత్వ హామీలు 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పి 900 రోజులు గడిచినా అమలు కాలేదని కేటీఆర్ విమర్శించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో ప్రజలు కే. చంద్రశేఖర్ రావు ను మాత్రమే గెలిపించాలని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!