
జనరల్

బీజేపీ నేతలు తన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. “జై శ్రీరామ్ అంటే పథకాలు వస్తాయా” అని మాత్రమే ప్రశ్నించానని, దానిని తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తామూ హిందువులమేనని, రాముడిని అందరూ భక్తితో పూజిస్తారని స్పష్టం చేశారు.
రాముడిపై నిజంగా ప్రేమ ఉంటే భద్రాద్రి ఆలయానికి రూ.200 కోట్లు నిధులు తీసుకురావాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. హిందువులమని తలపై ఎవరూ రాసుకోరని, మెడలో బోర్డులు వేసుకొని తిరగరని వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోనని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!