

ఆంధ్రప్రదేశ్‌లో ఏ4 మద్యం షాపుల రెన్యువల్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 23 అర్ధరాత్రితో రెన్యువల్ గడువు ముగియనుండగా.. ఇకపై గడువు పొడిగించే అవకాశం లేదని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా రెన్యువల్ కోసం 3,650 ఏ4 షాపులను నోటిఫై చేయగా.. ఇప్పటివరకు 3,236 షాపులు రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో 2,873 షాపులు రెన్యువల్ రిటైల్ ట్యాక్స్ (RET)ను పూర్తిగా చెల్లించాయి. మరో 33 షాపులు పాక్షికంగా చెల్లింపులు చేశాయి. మొత్తంగా 2,906 షాపులకు పూర్తి లేదా పాక్షిక RET చెల్లింపులు నమోదయ్యాయి.
ఈ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా నోటిఫై చేసిన మొత్తం షాపుల్లో 88.7 శాతం రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. దాదాపు 80 శాతం షాపులకు RET చెల్లింపులు పూర్తయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే 97.1 శాతం చెల్లింపులతో తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లా 94.7 శాతం, శ్రీ సత్యసాయి జిల్లా 91.8 శాతం, కోనసీమ జిల్లా 91.1 శాతం, ఏలూరు జిల్లా 91 శాతం చెల్లింపులతో ఉన్నాయి. నిర్ణయించిన గడువులోనే మిగిలిన షాపుల రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!