24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మండాడి’ టీమ్‌కు కమల్ హాసన్ అభినందనలు.. సూరి ఎమోషనల్ పోస్ట్

Writer: Chandrika 06:26 AM, 24 సెప్టెంబర్, 2026
‘మండాడి’ టీమ్‌కు కమల్ హాసన్ అభినందనలు.. సూరి ఎమోషనల్ పోస్ట్

వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మండాడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది. ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించగా.. మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి ద్వారా సెప్టెంబర్ 10న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు చిత్రబృందం వెల్లడించింది. సినిమా విజయంతో పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు. ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రశంసలు అందించగా, తాజాగా కమల్ హాసన్ స్వయంగా టీమ్‌ను కలిసి అభినందించారు.

దర్శకుడు మతిమారన్ పుగళేంది, నిర్మాత ఎల్రెడ్ కుమార్‌తో పాటు నటులు సూరి, సుహాస్, రవీంద్ర విజయ్‌లతో కమల్ హాసన్ ప్రత్యేకంగా మాట్లాడి వారి పనితీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా సూరి స్పందిస్తూ.. కమల్ హాసన్‌ను కలవడం తన జీవితంలో మర్చిపోలేని రోజని పేర్కొన్నారు. తమ టీమ్‌పై ఆయన చూపించిన ప్రేమ, అందించిన ఆశీస్సులు ఎప్పటికీ గుర్తుండిపోతాయని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇక సినిమాకు కథిర్ అందించిన సినిమాటోగ్రఫీ, జీవీ ప్రకాష్ కుమార్ సమకూర్చిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా థ్రిల్లింగ్ బోట్ సీక్వెన్స్, హై-వోల్టేజ్ రేసింగ్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలకు థియేటర్లలో మంచి స్పందన లభించింది. సూరి, సుహాస్ తమ సహజమైన నటనతో పాత్రలకు ప్రాణం పోయడంతో ‘మండాడి’ మరిన్ని వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందు నాని భార్య అంజనా ఎమోషనల్ పోస్ట్..

‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందు నాని భార్య అంజనా ఎమోషనల్ పోస్ట్..

‘ది ప్యారడైజ్‌’పై నాని భార్య అంజన భావోద్వేగ పోస్ట్‌

‘ది ప్యారడైజ్‌’పై నాని భార్య అంజన భావోద్వేగ పోస్ట్‌

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్

చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ టాక్..

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ టాక్..

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్

ట్యాగ్లు
మండాడిమండాడి సినిమాసూరిసుహాస్కమల్ హాసన్రజనీకాంత్తమిళ సినిమాతెలుగు విడుదలబాక్సాఫీస్100 కోట్ల క్లబ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత రక్షణ రంగంలో మరో భారీ ఒప్పందం..
బిజినెస్

భారత రక్షణ రంగంలో మరో భారీ ఒప్పందం..

ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..
జనరల్

ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..

ఉత్తరాంధ్ర అతలాకుతలం.. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు
జనరల్

ఉత్తరాంధ్ర అతలాకుతలం.. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు

భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 టికెట్ల విక్రయ తేదీ వెల్లడించిన హెచ్‌సీఏ...
క్రీడలు

భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 టికెట్ల విక్రయ తేదీ వెల్లడించిన హెచ్‌సీఏ...

ఆసియా క్రీడల్లో భారత ఉషు స్టార్ రోషిబినా దేవి దూకుడు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత ఉషు స్టార్ రోషిబినా దేవి దూకుడు..

ది ప్యారడైజ్ రివ్యూ: నాని మాస్ అవతార్ అంచనాలను అందుకుందా?
రివ్యూలు

ది ప్యారడైజ్ రివ్యూ: నాని మాస్ అవతార్ అంచనాలను అందుకుందా?

ఏపీ మద్యం షాపుల రెన్యువల్‌కు గడువు ముగింపు..
జనరల్

ఏపీ మద్యం షాపుల రెన్యువల్‌కు గడువు ముగింపు..

జపాన్‌లో బుమ్రా పిల్లో షాపింగ్‌పై సంజన సెటైర్..
క్రీడలు

జపాన్‌లో బుమ్రా పిల్లో షాపింగ్‌పై సంజన సెటైర్..

హోర్ముజ్ జలసంధిలో విదేశీ నౌకలపై ఇరాన్ కీలక నిర్ణయం..
జనరల్

హోర్ముజ్ జలసంధిలో విదేశీ నౌకలపై ఇరాన్ కీలక నిర్ణయం..

‘మండాడి’ టీమ్‌కు కమల్ హాసన్ అభినందనలు.. సూరి ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

‘మండాడి’ టీమ్‌కు కమల్ హాసన్ అభినందనలు.. సూరి ఎమోషనల్ పోస్ట్

‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందు నాని భార్య అంజనా ఎమోషనల్ పోస్ట్..
సినిమాలు

‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందు నాని భార్య అంజనా ఎమోషనల్ పోస్ట్..

ఆసియా క్రీడల్లో మీరాబాయి చాను మెరుపులు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో మీరాబాయి చాను మెరుపులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!