
టెక్నాలజీ

సిట్ విచారణ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. భోజన సమయంలో మాట్లాడిన ఆయన, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తాను ఊపిరిపోసిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఉద్యమాన్ని ముందుకు నడిపేందుకు అనేక త్యాగాలు చేశానని, ఆ పోరాటం తన జీవితంలో అత్యంత కీలక అధ్యాయమని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహ రచన చేసిన అదే గదిలో ఇప్పుడు విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గదిలోనే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, అనేక మందితో కీలక చర్చలు జరిపానని గుర్తు చేసుకున్నారు. అదే గదిలో ఇప్పుడు విచారణ ఎదుర్కోవడం దురదృష్టకరమని అన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!