1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్

Writer: Nithish 11:14 AM, 17 సెప్టెంబర్, 2026
సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ప్రత్యేకమైన రోజని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకుంటూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సమ్మక్క-సారలమ్మల పోరాటం నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు ఈ నేల అన్యాయాన్ని ఎదిరించిన చరిత్ర కలిగి ఉందని సీఎం అన్నారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమై, రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. ప్రజా పాలన అంటే ప్రజల మాటకు విలువ ఇవ్వడం, వారి సమస్యలను పరిష్కరించడం, హక్కులను కాపాడటం, ప్రభుత్వ వనరులు అందరికీ చేరేలా చూడటమని వివరించారు. చరిత్రను మరచిపోకుండా, పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు 37.13 శాతం పోలింగ్

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు 37.13 శాతం పోలింగ్

'ఓటు చోరీ' వివాదానికి దాదాపు 150 ఏళ్ల చరిత్ర

'ఓటు చోరీ' వివాదానికి దాదాపు 150 ఏళ్ల చరిత్ర

ట్యాగ్లు
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంరేవంత్ రెడ్డితెలంగాణ ప్రభుత్వంగన్ పార్క్అమరవీరుల స్థూపంపబ్లిక్ గార్డెన్స్తెలంగాణ చరిత్రసెప్టెంబర్ 17ప్రజా పాలనతెలంగాణ ఉద్యమం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైలో ఓపెన్ 500 ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్..
క్రీడలు

హైలో ఓపెన్ 500 ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్..

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం..
క్రీడలు

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం..

ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం
జనరల్

ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే
జనరల్

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే

చివరి టీ20లో గెలుపే లక్ష్యంగా భారత్‌.. కివీస్‌పై ఆధిపత్యం చాటేనా?
క్రీడలు

చివరి టీ20లో గెలుపే లక్ష్యంగా భారత్‌.. కివీస్‌పై ఆధిపత్యం చాటేనా?

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..
జనరల్

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

మధుమేహం కంటే అధిక బీఎంఐతోనే తల్లిపాలివ్వడంలో తగ్గుదల ఉండొచ్చు: అధ్యయనం
ఆరోగ్యం

మధుమేహం కంటే అధిక బీఎంఐతోనే తల్లిపాలివ్వడంలో తగ్గుదల ఉండొచ్చు: అధ్యయనం

బ్యాంకు ఓటీపీలే టార్గెట్‌.. ‘మిస్టర్‌ రోబోట్‌’ సైబర్‌ ముఠా కొత్త మోసం!
టెక్నాలజీ

బ్యాంకు ఓటీపీలే టార్గెట్‌.. ‘మిస్టర్‌ రోబోట్‌’ సైబర్‌ ముఠా కొత్త మోసం!

మారుతున్న భారతీయ కుటుంబాల ఖర్చుల తీరు..
బిజినెస్

మారుతున్న భారతీయ కుటుంబాల ఖర్చుల తీరు..

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత
జనరల్

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత

పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలి- వైఎస్ జగన్
రాజకీయాలు

పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలి- వైఎస్ జగన్

కామన్వెల్త్ కబడ్డీలో భారత్ డబుల్ ధమాకా..
క్రీడలు

కామన్వెల్త్ కబడ్డీలో భారత్ డబుల్ ధమాకా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!