

పుదుచ్చేరిలో బుధవారం ప్రారంభమైన సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో ఈనాడు సీఎస్‌ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్లు సత్తా చాటారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు క్రీడాకారులు వివిధ విభాగాల్లో పతకాలు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. తెలంగాణకు చెందిన శ్రీదివ్య డోరా అండర్-16 బాలికల 80 మీటర్ల హర్డిల్స్‌లో 12.21 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుద్దు శేషు 100 మీటర్ల పరుగును 10.92 సెకన్లలో పూర్తి చేసి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
ఇతర విభాగాల్లోనూ ‘లక్ష్య’ అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మౌనిక మిశ్రా లాంగ్‌జంప్‌లో 5.41 మీటర్ల దూరం దూకి రజత పతకం సాధించింది. తెలంగాణ క్రీడాకారిణి ప్రశంస బాలికల 400 మీటర్ల పరుగును 58.17 సెకన్లలో పూర్తి చేసి కాంస్యం గెలుచుకుంది. తెలంగాణకు చెందిన రఘుపతి నాయుడు ట్రయథ్లాన్‌లో కాంస్య పతకం సాధించగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిషిత జావెలిన్ త్రోలో 31.16 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. దీంతో సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ‘లక్ష్య’ అథ్లెట్ల ప్రదర్శన ఆకట్టుకుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!