

ఎన్నికల అఫిడవిట్‌లో తాను వెల్లడించిన ఆస్తుల కంటే ఒక్క గజం భూమి ఎక్కువగా ఉన్నా ప్రభుత్వానికి అప్పగిస్తానని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబానికి భూములు ఉన్నట్లు తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె పేర్కొన్నారు. అసెంబ్లీలో సీఎం ప్రస్తావించిన భూముల వివరాల్లో వాస్తవాలను తేల్చేందుకు సీబీఐ విచారణకు ఆదేశించాలని కవిత డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించిన పలువురు వ్యక్తులు, నేతలకు సంబంధించిన భూములపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని కవిత కోరారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉన్నారని ఆమె పేర్కొన్న సీఎం గూఢచారితో పాటు నవీన్ రావు, కొండల్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి తదితరుల భూములపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల కంటే అదనంగా తన వద్ద భూమి ఉన్నట్లు తేలితే ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని మరోసారి స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!