
గాసిప్స్

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్కు చేరుకున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలకు హాజరుకావాలని ఆయన నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవలే ప్రెస్మీట్ నిర్వహించి కృష్ణా జిల్లా అంశంపై పోరాటం చేస్తామని ప్రకటించిన కేసీఆర్, అదే అంశాన్ని శాసనసభ వేదికగా తీసుకెళ్లి తొలి అడుగు వేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
శాసనసభకు హాజరయ్యేందుకు వీలుగా కేసీఆర్ ఈ సాయంత్రం ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ నందినగర్ నివాసానికి చేరుకున్నారు. కృష్ణా జలాల సాధన, పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయడంలో ప్రభుత్వ వైఫల్యాలను శాసనసభలో ధీటుగా ప్రశ్నించాలని బీఆర్ఎస్ వ్యూహంగా వ్యవహరిస్తోంది. ఈ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనడం ద్వారా సభలో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.





.jpg&w=3840&q=75)












.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!