

బాలీవుడ్ నటులు ఇమ్రాన్ హష్మీ, దిశా పటాని జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అవరాపన్-2' విడుదలకు సిద్ధమైంది. 2007లో విడుదలై సంచలన విజయం సాధించిన 'అవరాపన్' చిత్రానికి ఇది సీక్వెల్. ఇప్పటికే ఈ సినిమాను ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల సినిమా సెప్టెంబర్‌కు వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ పుకార్లపై హీరో ఇమ్రాన్ హష్మీ, నిర్మాత విశేష్ భట్ స్పందిస్తూ అవన్నీ పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ఒకసారి విడుదల తేదీ ప్రకటించిన తర్వాత వాయిదా వేయడం తమ నిర్మాణ సంస్థకు అలవాటు కాదని తెలిపారు. ఆగస్టు 6న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణతో పాటు షూటింగ్ సమయంలో ఇమ్రాన్ హష్మీ గాయపడటంతో కొంత ఆలస్యం జరిగినప్పటికీ, సినిమా ఎలాంటి మార్పులు లేకుండా ఆగస్టు 14నే ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!