
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు ఘటనపై మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు తెలిపారు. ఈ అంశంపై మెటా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై వివరణ ఇచ్చారు. సాంకేతిక లోపం కారణంగానే మోదీ వీడియో డిలీట్ అయిందని మెటా వెల్లడించింది. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, దీనిపై జుకర్‌బర్గ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
అలాగే మెటా ప్లాట్‌ఫామ్‌లలో సీఎస్‌ఏఎం కంటెంట్, డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తిపై కూడా సంస్థ విచారం వ్యక్తం చేసింది. కొన్ని రకాల కంటెంట్‌ను ప్రోత్సహించడంలో, ప్లాట్‌ఫామ్ నిర్వహణలో లోపాలు జరిగాయని మెటా అంగీకరించింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తామని సంస్థ తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!