
జనరల్

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ నేతలు నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులను కాపాడాలని నినాదాలు చేస్తూ, పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
"డీసీసీని హఠావో.. కాంగ్రెస్‌ను బచావో" అంటూ నినాదాలు చేసిన నేతలు, డీసీసీని తొలగించి పార్టీని కాపాడాలని కోరుతూ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందించారు. పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించి, కార్యకర్తలకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!