

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సోషల్ మీడియాలో చేసిన ఓ క్రిప్టిక్ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ట్విట్టర్ (X) వేదికగా ఆయన విజయమే విమర్శకులకు సరైన సమాధానమని, చిరునవ్వుతోనే ప్రతికూలతను జయించాలని పేర్కొన్నారు. కఠోర శ్రమ, జీవితంలో ఎదుగుదల, సానుకూల దృక్పథమే మనల్ని సందేహించే వారి నోళ్లు మూయిస్తాయని, ఇతరుల విమర్శలకు స్పందిస్తూ సమయం వృథా చేయకుండా విజయంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ పోస్ట్‌తో అభిమానులు, నెటిజన్లు ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ సందేశం ఇచ్చారో అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. కొందరు ట్రోల్స్‌కు సమాధానమని భావిస్తుండగా, మరికొందరు ఇది సాధారణ ప్రేరణాత్మక సందేశమని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, సందీప్ కిషన్ నటించిన 'సిగ్మా' విడుదలకు సిద్ధంగా ఉండగా, దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న 'కరికాల' చిత్రం వచ్చే ఏడాది రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!