
సినిమాలు

తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. 59 ఏళ్ల తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో కాంగ్రెస్ మళ్లీ ప్రవేశించనుంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ప్రకారం, టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేశ్ కుమార్, విశ్వనాథన్‌లు మంత్రులుగా చేరనున్నారు.
శాసనసభ ఎన్నికల్లో మెజారిటీ రాకపోవడంతో టీవీకే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తొలిదశలో 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, గురువారం మంత్రివర్గ విస్తరణ జరగనుంది. సీపీఐ, సీపీఎం ఇప్పటికే మంత్రివర్గంలో చేరబోమని ప్రకటించగా, వీసీకే తమ నిర్ణయాన్ని త్వరలో వెల్లడించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!