

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాలనే అంశాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తావించారు. చిన్న పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయంపై ఆలోచిస్తోంది. 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాలనే నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలను 90 రోజుల్లో ఖరారు చేస్తామని తెలిపారు.
అలాగే మైనర్లకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తోంది. ఇటీవల వచ్చిన ఆర్థిక సర్వే నివేదికలో కూడా మైనర్లకు సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించాలని కేంద్రానికి సూచనలు వచ్చినట్లు సమాచారం.









.jpeg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!