
క్రీడలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నీట్ పరీక్ష రద్దు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రశ్నాపత్రం లీక్ కారణంగా పరీక్ష రద్దు కావడం కేంద్రానికి సిగ్గుచేటని అన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వైఫల్యం వల్ల కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడినట్టైందని వ్యాఖ్యానించారు.
పరీక్షకు ముందురోజే వందకు పైగా ప్రశ్నలు లీక్ అయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. 2024లో కూడా ఇలాంటి వివాదం చోటుచేసుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!