13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌సీపై ట్విస్ట్‌.. ఈసీ కీలక ప్రకటన!

Writer: Shivani K 05:13 AM, 13 ఆగస్టు, 2026
ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌సీపై ట్విస్ట్‌.. ఈసీ కీలక ప్రకటన!

ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో ధ్రువీకరణ పత్రంగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం జారీ చేస్తున్న కుటుంబ రిజిస్టర్‌ ధ్రువీకరణ పత్రం (ఎఫ్‌ఆర్‌సీ)ను పరిగణనలోకి తీసుకోలేమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ఎఫ్‌ఆర్‌సీని రేషన్‌ కార్డులోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని జారీ చేస్తున్నందున, అది రేషన్‌ కార్డుతో సమానమైన పత్రంగా మాత్రమే పరిగణించబడుతుందని తెలిపింది. సుప్రీంకోర్టు ఆమోదించిన 12 ధ్రువీకరణ పత్రాల జాబితాలో రేషన్‌ కార్డు లేనందున, దాని ఆధారంగా జారీ చేసే ఎఫ్‌ఆర్‌సీని ప్రత్యేక సమగ్ర సవరణలో ధ్రువీకరణ పత్రంగా స్వీకరించలేమని వెల్లడించింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 జూలై 25న జారీ చేసిన మెమో ఆధారంగా, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి జారీ చేసిన పాత కుటుంబ రిజిస్టర్‌ ధ్రువీకరణ పత్రాలను మాత్రం పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.

ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఎఫ్‌ఆర్‌సీపై స్పష్టత కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాసింది. ఈ అంశంపై న్యాయస్థానంలోనూ పిటిషన్‌ దాఖలైంది. రాజకీయంగానూ దీనిపై విస్తృత చర్చ జరిగింది. ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు అందుకునే ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 12 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. 2002 నాటి ఓటర్ల జాబితాతో వివరాలు సరిపోలని లేదా అనుమానం ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. నోటీసులు అందుకున్న ఓటర్లు ఎన్నికల నమోదు అధికారిని ఎదుట హాజరై, ఆమోదించిన 12 పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గత నెల 25న జీవో నంబర్‌ 172ను జారీ చేసి, రేషన్‌ కార్డులోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కుటుంబ రిజిస్టర్‌ ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని తహసీల్దార్లను ఆదేశించింది. అయితే ఎలాంటి క్షేత్రస్థాయి విచారణ లేకుండా కేవలం రేషన్‌ కార్డు ఆధారంగా జారీ చేసిన ఎఫ్‌ఆర్‌సీలను అంగీకరించబోమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో కీలక పథకాలకు షాక్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

తెలంగాణలో కీలక పథకాలకు షాక్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

పవన్‌ కొత్త పిలుపు.. యువతకు ఏం చెప్పారంటే?

పవన్‌ కొత్త పిలుపు.. యువతకు ఏం చెప్పారంటే?

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు...

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు...

ఇందిరమ్మ టవర్స్‌కు రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన..

ఇందిరమ్మ టవర్స్‌కు రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన..

భర్త పాదాలకు పూజ చేసిన హీరోయిన్ ప్రణీత..

భర్త పాదాలకు పూజ చేసిన హీరోయిన్ ప్రణీత..

గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి

గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
సర్‌ప్రత్యేక సమగ్ర సవరణకేంద్ర ఎన్నికల సంఘంతెలంగాణఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ఎఫ్‌ఆర్‌సీఓటర్ల జాబితారేషన్ కార్డుఎన్నికల ప్రక్రియతెలంగాణ ఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌
జనరల్

తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు
రాజకీయాలు

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!
జనరల్

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!
జనరల్

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?
జనరల్

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?

నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?
సినిమాలు

నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?

అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?
బిజినెస్

అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?

తెలంగాణలో కీలక పథకాలకు షాక్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు!
జనరల్

తెలంగాణలో కీలక పథకాలకు షాక్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

పవన్‌ కొత్త పిలుపు.. యువతకు ఏం చెప్పారంటే?
జనరల్

పవన్‌ కొత్త పిలుపు.. యువతకు ఏం చెప్పారంటే?

ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌సీపై ట్విస్ట్‌.. ఈసీ కీలక ప్రకటన!
జనరల్

ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌సీపై ట్విస్ట్‌.. ఈసీ కీలక ప్రకటన!

దిల్‌రాజు కాపీరైట్‌ కేసులో సుప్రీం తీర్పు.. తదుపరి ఏంటి?
సినిమాలు

దిల్‌రాజు కాపీరైట్‌ కేసులో సుప్రీం తీర్పు.. తదుపరి ఏంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!