
జనరల్

బీఆర్ఎస్ నేత కవిత ట్వీట్ చేస్తూ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో పెండింగ్ పనులపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించిందని పేర్కొన్నారు. ప్రశ్నించడం వల్లే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనడానికి ఇదే నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు.
తమ పార్టీ చేసిన డిమాండ్లకు ప్రభుత్వం స్పందించి భూసేకరణను వేగవంతం చేయాలని నిర్ణయించిందని తెలిపారు. భూసేకరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగాలని, భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని ఆమె కోరారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభించడంతో పాటు పెండింగ్లో ఉన్న 19, 20, 21 ప్యాకేజీల పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!