

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యాటక శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, టూరిజం కార్యదర్శి వాణి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి పాల్గొన్నారు. తారామతి బారాదరిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు దుర్గం చెరువును పూర్తి స్థాయి టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. అలాగే మంజీరా, దిల్‌కుషా గెస్ట్ హౌస్‌ల ఆధునీకరణతో పాటు టూరిజం హబ్ డెవలప్‌మెంట్ పథకం కింద వికారాబాద్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు.
వికారాబాద్‌లోని వీరభద్రస్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. క్యూర్ పరిధిలోని అటవీ భూములను ఎకో టూరిజంగా అభివృద్ధి చేయడం, గుర్రంగూడ ఎకో పార్క్ నమూనాలో నగరంలో ఎకో పార్కులు ఏర్పాటు చేయడం, ఫ్యూచర్ సిటీలోని అటవీ ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సూచించారు. పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిలను పర్యాటక ఆకర్షణలుగా తీర్చిదిద్దడం, అవసరమైతే ట్రాఫిక్ మళ్లించి పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడం, డిసెంబర్‌లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కోసం శాఖల మధ్య సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ఏర్పాట్లు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!