

పశ్చిమ బెంగాల్‌లోని ఫల్టా నియోజకవర్గంలో మే 21న జరగనున్న రీపోలింగ్‌కు ముందు టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. పోలింగ్ సమయంలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇకపై ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని జహంగీర్ ఖాన్ వెల్లడించారు. ఫల్టా అభివృద్ధి చెందాలని, అక్కడ శాంతియుత వాతావరణం కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ పరిణామంపై స్పందించిన తృణమూల్ కాంగ్రెస్, జహంగీర్ ఖాన్ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని స్పష్టం చేసింది. మే 4న ఫలితాలు వెలువడినప్పటి నుంచి తమ పార్టీకి చెందిన 100 మందికి పైగా కార్యకర్తలను అరెస్టు చేశారని ఆరోపించింది. అలాగే పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయని పేర్కొంది. ఈవీఎంల తారుమారు, సీసీటీవీ ఫుటేజీ లేకపోవడం, ఓటర్ల బెదిరింపులపై ఫిర్యాదులు చేసినప్పటికీ ఎన్నికల సంఘం స్పందించలేదని టీఎంసీ విమర్శించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!