

ఇరాన్‌పై చేపట్టిన మిషన్ ఇంకా పూర్తికాలేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. అణ్వాయుధ కార్యక్రమాలను పునరుద్ధరించడంతోపాటు తమ దేశ భద్రతకు ముప్పు కలిగించే ఇతర చర్యలకు టెహ్రాన్ పాల్పడుతోందని ఆరోపించింది. అమర సైనికుల స్మారక కార్యక్రమంలో పాల్గొన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ మాట్లాడుతూ.. దేశ లక్ష్యాలను సాధించాలంటే ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) పూర్తి సామర్థ్యంతో సిద్ధంగా ఉండాలని అన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే కీలక చర్యల నేపథ్యంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో మరోసారి యుద్ధం మొదలైతే కాల్పులకు దిగవద్దని ఇరాన్ మద్దతు ఉన్న హెజ్‌బొల్లాను హెచ్చరించారు.
‘‘ఇరాన్ విషయంలో మా మిషన్ ఇంకా పూర్తికాలేదు. అణ్వాయుధ కార్యక్రమాలను తిరిగి ప్రారంభించడంతోపాటు ఇజ్రాయెల్‌ను ప్రమాదంలోకి నెట్టే ఇతర ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి బెదిరింపులను అంగీకరించలేం’’ అని కట్జ్ స్పష్టం చేశారు. గాజా, లెబనాన్, సిరియా నుంచి తమ బలగాలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తెలిపారు. ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు ఇరాన్‌తో కలిసి హెజ్‌బొల్లా ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!