

వైసీపీ అధినేత జగన్ చుట్టూ ఇటీవల కొన్ని అసహజ మార్పులు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కుటుంబంలోనూ, పార్టీ నేతల్లోనూ నిరుత్సాహం పెరుగుతోందన్న భావన వ్యక్తమవుతోంది. జగన్ ఇంతకాలం మాదిరిగా బహిరంగంగా పార్టీ కార్యకలాపాలు నడిపించకపోవడం, ముఖ్య నిర్ణయాల విషయాల్లో స్పష్టమైన దిశ కనిపించకపోవడం నాయకుల్లో చర్చకు దారి తీసింది. గతంలో జగన్ ఎక్కడికైనా వెళ్లినా పెద్ద ఎత్తున అనుచరులు, కార్యకర్తలు గుమికూడడం సహజం. అయితే ఇప్పుడు ఆ ఉత్సాహం గణనీయంగా తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల జగన్ బెంగళూరు వెళ్లినప్పుడు ఆయనకు వీడ్కోలు పలికేందుకు 50 మంది కూడా తక్కువ మంది మాత్రమే రావడం గమనార్హం.
ఆయన బెంగళూరు నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు కూడా పరిస్థితి పెద్దగా మారలేదు. జగన్ రాక సందర్భంగా భారీ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్ల వంటి ఏర్పాట్లు చేసినప్పటికీ, అక్కడికి చేరుకున్న నేతల సంఖ్య మాత్రం అతి స్వల్పం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు మరికొద్ది మంది మాత్రమే జగన్కు స్వాగతం పలికారు. వచ్చిన వారికంటే అక్కడ ఉన్న పోలీసుల సంఖ్యే ఎక్కువగా కనిపించింది.
గతంలో జగన్ రాక అంటే పూల మాలలు, గజమాలలు, భారీ గుంపులు, కార్యకర్తల గోలగోల ఇవన్నీ సాధారణ దృశ్యాలే. అయితే ఇప్పుడు ఆ తీవ్రత కనిపించకపోవడం పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వ్యక్తిగత స్థాయిలో జగన్పై ఆదరణ తగ్గుతుందనే పరిశీలకుల అభిప్రాయం మరింత చర్చనీయాంశమవుతోంది.
నాయకుల్లోనే నిస్పృహ పెరుగితే, అది పార్టీకి మరింత ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!