

అమెరికా–ఇజ్రాయెల్ ఉమ్మడి దాడుల అనంతరం ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. తొలుత ఇజ్రాయెల్ పై క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు చాలా వరకు వాటిని అడ్డుకున్నప్పటికీ, రాజధాని టెల్ అవీవ్ సహా దేశ ఉత్తర ప్రాంతాల్లో పలుచోట్ల పేలుళ్లు చోటుచేసుకున్నాయి.
ఇజ్రాయెల్ ప్రభుత్వం పౌరులందరినీ అప్రమత్తం చేసింది. కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించి, బాంబు షెల్టర్లకు సమీపంలో ఉండాలని సూచించింది. ఇదిలా ఉండగా, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల పై కూడా ఇరాన్ దాడులు కొనసాగించింది. ఖతార్‌లోని Al Udeid Air Base, కువైట్‌లోని Al Salem Air Base, యూఏఈలోని Al Dhafra Air Base, బహ్రెయిన్‌లో ఉన్న United States Fifth Fleet ప్రధాన కార్యాలయం, సౌదీలోని రియాద్, జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించినట్లు సమాచారం.
ఖతార్ రాజధాని దోహా, యూఏఈలోని దుబాయ్ నగరాల్లో వరుస పేలుళ్లు సంభవించాయి. క్షిపణి శకలాలు పడటంతో అబుదాబిలో ఒకరు, దుబాయ్‌లో మరొకరు మృతి చెందినట్లు సమాచారం. దుబాయ్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా సమీపంలోని ఓ భవనంపై డ్రోన్ దాడి జరిగిందని అధికారులు తెలిపారు.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్కు చెందిన మేజర్ జనరల్ ఇబ్రహీం జబారి మాట్లాడుతూ, ఇప్పటివరకు ఉపయోగించినవి పాత క్షిపణులేనని, అవసరమైతే మరింత ఆధునిక ఆయుధాలను వినియోగిస్తామని అమెరికా, ఇజ్రాయెల్‌లకు హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించారు.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.


_1771477764226.jpg&w=3840&q=75)









.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!