
రాజకీయాలు

అమెరికాతో చర్చలు జరిపే పరిస్థితి ప్రస్తుతం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ స్పష్టం చేశారు. అమెరికాతో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, తమ దేశం తలొగ్గదని ఆయన తెలిపారు. అమెరికాతో చర్చలు ఇకపై కార్యాచరణలో లేవని ఆయన తేల్చి చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో యుద్ధాన్ని ముగించేందుకు చర్యలు తీసుకుంటామని చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ ధీటుగా స్పందించింది. అవసరమైతే అమెరికాతో పదేళ్లు అయినా యుద్ధం చేయడానికి సిద్ధమని, తమకు ఎన్నేళ్లయినా పోరాడే శక్తి ఉందని ఇరాన్ నేతలు హెచ్చరించారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!