
సినిమాలు
.jpg&w=3840&q=75)
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇరాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెరిగిన జీవన వ్యయాలు, ఆర్థిక ఒత్తిళ్లతో అక్కడి ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు కొనసాగిస్తున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఇరాన్‌తో వాణిజ్యం నిర్వహించే అన్ని దేశాల పై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’ ద్వారా ప్రకటించారు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇరాన్ పై ఈ నిర్ణయం మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ పరిణామం గ్లోబల్ వాణిజ్యం పై కూడా ప్రభావం చూపుతుందనే చర్చ సాగుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!