

తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె కాంగ్రెస్ అధిష్ఠానానికి తన వివరణను పూర్తిగా ఇచ్చినట్లు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తన అభిప్రాయాలను వెల్లడించినట్లు చెప్పారు. సుస్మిత స్వతంత్రంగా తన జీవితంపై నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అని, ఆమె వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను మంత్రిగా అవినీతి ఆరోపణలు లేకుండా పనిచేస్తున్నానని, ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడమే తప్పని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. పార్టీలో కొందరు తనపై ఆరోపణలు చేయించారని, వారు ఎవరో తనకు తెలుసని చెప్పారు. అయితే వారి పేర్లు వెల్లడిస్తే మరో వివాదం తలెత్తుతుందని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్ఠానం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మీనాక్షి నటరాజన్‌కు తన వివరణ ఇచ్చినట్లు, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌కు రాతపూర్వకంగా వివరణ సమర్పించినట్లు తెలిపారు. పార్టీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తన తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!