

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ఫాంటసీ చిత్రం రాకాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాలో బన్నీ పాత్రకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు, రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఒకటి కాదు ఏకంగా మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది.
గతంలో ఈ మూడు పాత్రల్లో రెండు తండ్రీకొడుకులుగా ఉంటాయని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన రూమర్ తెరపైకి వచ్చింది. సినిమాలోని మూడు పాత్రలు డోపెల్‌గ్యాంగర్స్‌గా కనిపిస్తాయని, శారీరకంగా ఒకే పోలిక ఉన్నప్పటికీ వారి మధ్య ఎలాంటి రక్త సంబంధం ఉండదని ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త టాక్ నిజమైతే కథ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!