
రాజకీయాలు

యశ్ నటిస్తున్న టాక్సిక్ సినిమా చుట్టూ సోషల్ మీడియాలో కొత్త వివాదం మొదలైంది. తమకు టాక్సిక్ టీమ్ నుంచి లీగల్ నోటీసులు వచ్చాయని కొందరు ఎక్స్ యూజర్లు పోస్టులు చేస్తున్నారు. బుక్‌మైషోలో ఈ సినిమా రేటింగ్స్ ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించినందుకే తమపై ఈ చర్య తీసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఆరోపణలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. విమర్శలు, ప్రశ్నలను ఎదుర్కోలేకపోతే సినిమాలు ఎందుకు చేయాలని కొందరు ప్రశ్నిస్తూ, ఇలాంటి చర్యలు సరికావని మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం వ్యంగ్యంగా స్పందిస్తూ, తమకు ‘వండర్ఫుల్ సర్ప్రైజ్’ ఇచ్చినందుకు థాంక్స్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే లీగల్ నోటీసులకు సంబంధించిన ఈ ఆరోపణలపై టాక్సిక్ టీమ్ నుంచి అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!