
జనరల్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన వివరణను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇప్పటికే ఇచ్చానని తెలిపారు. తనపై చర్యలు తీసుకునే ముందు రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించిన ఆమె, తన కుమార్తె మాట్లాడిన అంశాల్లో వాస్తవాలే ఉన్నాయని పేర్కొన్నారు.
తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వస్తున్న కమీషన్ ఆరోపణల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మంత్రులు, నేతలు అసంతృప్తితో ఉన్నారని ఆమె అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!