

కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాల బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకే 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శనతో పాటు గ్రామాల్లో బాకీ కార్డుల పంపిణీ చేపడుతున్నామని తెలిపారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, పింఛన్లు, రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా, పంటలకు బోనస్, రైతు కూలీలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఎర్రబెల్లి ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ ప్రజల తరఫున నిరంతరం ఉద్యమాలు, పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి మాటలు, తుపాకీ రాముని మాటలు ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిరసనలో జిల్లా, మండల, గ్రామస్థాయి బీఆర్‌ఎస్ నాయకులు, యువజన, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!