
రాజకీయాలు

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకున్నప్పటికీ ఆయనపై కేసులు నమోదు చేసి వేధించడం కక్షపూరిత ధోరణికి నిదర్శనమని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని అన్నారు.
వైఎస్ షర్మిల కూడా ఈ అంశంపై స్పందిస్తూ, వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న తర్వాత కూడా కేసులు కొనసాగించడం దారుణమని విమర్శించారు. ఇది కూటమి ప్రభుత్వానికి తగిన విధానం కాదని పేర్కొన్నారు. వెంటనే ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై నమోదైన కేసులను ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!