
సినిమాలు

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనను పురస్కరించుకుని ఈ నెల 12న తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అమరావతి, విశాఖపట్నం ప్రాంతాల్లో తలపెట్టిన సభలను రద్దు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఒకే సభగా తిరుపతిని ఎంపిక చేశారు.
ఈ సభ ఏర్పాట్లను మంత్రి అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈ సభకు హాజరుకానున్నారు. 40 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 50 వేల మంది కూర్చునేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. “సంక్షేమం–అభివృద్ధి–నమ్మకం” నినాదంతో ఈ సభ నిర్వహించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!