

పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లు-2026పై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జెన్-జీ యువత విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే కెమెరా యాంగిల్స్ లేదా సోషల్ మీడియా వీడియోలు మార్చడం సరిపోదని, ప్రభుత్వ ఆలోచనా విధానం మారాలని ఆమె వ్యాఖ్యానించారు. నేటి యువతకు నిజానిజాలు గుర్తించే అవగాహన ఉందని, వారి విశ్వాసాన్ని పొందాలంటే పారదర్శకత, నిజాయతీ అవసరమని పేర్కొన్నారు.
నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై నిరసన తెలిపిన విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై కూడా ప్రియాంక ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే 2024లో పరీక్షల పేపర్ లీకేజీలను అరికట్టేందుకు తీసుకొచ్చిన చట్టం కింద ఇప్పటివరకు ఎవరూ శిక్షించబడలేదని ఆరోపించారు. గత పదేళ్లలో జరిగిన పలు ప్రశ్నాపత్రాల లీకేజీల వల్ల కోట్లాది మంది విద్యార్థులు ప్రభావితమయ్యారని పేర్కొంటూ, కేవలం కమిటీలు ఏర్పాటు చేయడం కాకుండా విద్యా సంస్కరణలు, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!