
టెక్నాలజీ

ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ మరోసారి తన సత్తా చాటింది. సోమవారం మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా సింగ్ స్వర్ణం, మను బాకర్ కాంస్యం గెలిచిన తర్వాత, మంగళవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సోనమ్ ఉత్తమ్ మస్కర్-హిమాంశు ధిల్లాన్ జోడీ కాంస్య పతకాన్ని అందుకుంది. ఫైనల్లో ఇద్దరూ తలో 220.6 పాయింట్లు నమోదు చేసి మొత్తం 441.2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు.
ఈ విభాగంలో చైనా జట్లు స్వర్ణం, రజత పతకాలను కైవసం చేసుకోగా, మరో భారత జోడీ ఇలవేనిల్ వలరివన్-పార్థ్ మఖీజా 378.8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఫలితంతో ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో భారత్ ఇప్పటివరకు ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్య పతకాలతో మొత్తం నాలుగు పతకాలు సాధించి అంతర్జాతీయ షూటింగ్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!