

సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘రోమాంచకం’ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. టి. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి వాసుకి వైభవ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ విడుదలకు సంబంధించిన కీలక అప్డేట్‌ను ప్రకటించారు. ‘రోమాంచకం’ ఓవర్సీస్ హక్కులను నిర్వాణ సినిమాస్ సంస్థ సొంతం చేసుకుంది. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల తర్వాత వంగా పిక్చర్స్‌తో మరోసారి నిర్వాణ సినిమాస్ భాగస్వామ్యం కావడం విశేషంగా మారింది. అలాగే అమెరికాలో ఈ చిత్ర ప్రీమియర్స్‌ను సెప్టెంబర్ 2న ప్రదర్శించనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!