
.jpg&w=3840&q=75)
కర్ణాటక అసెంబ్లీ సమావేశాల తొలి రోజే హైడ్రామా చోటుచేసుకుంది. ఉపాధి హామీ పథకానికి సవరణలు వద్దనే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ పూర్తిగా చదవకుండా కేవలం రెండు లైన్లు మాత్రమే చదివి సభ నుంచి వాకౌట్ చేశారు. “ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక పురోగతిని వేగవంతం చేయడానికి కట్టుబడి ఉంది. జై హింద్, జై కర్ణాటక” అంటూ ఆయన ప్రసంగాన్ని ముగించారు. దీంతో సభలో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. గవర్నర్ వైఖరి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 176, 163 లను ఉల్లంఘించారని విమర్శించారు. ప్రతి ఏడాది అసెంబ్లీ ఉమ్మడి సమావేశంలో గవర్నర్ క్యాబినెట్ రూపొందించిన ప్రసంగాన్నే చదవాల్సిన అవసరం ఉందని, దానికి భిన్నంగా స్వయంగా రూపొందించిన ప్రసంగాన్ని చదవడం రాజ్యాంగ విరుద్ధ చర్యగా సీఎం అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై గవర్నర్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టడమే కాకుండా, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!