

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. స్పెషల్ ఫ్లైట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ కూడా హాజరయ్యారు.
రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతి, మరియు రాబోయే మౌలిక వసతుల అభివృద్ధి పై ఈ భేటీలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఏపీ లో అదానీ గ్రూప్ చేపట్టిన పోర్టులు, సిమెంట్, ఎనర్జీ, డేటా సెంటర్లు, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల ప్రాజెక్టుల పై సమీక్ష జరిగినట్లు తెలుస్తోంది.
ఇటీవల విశాఖలో జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్లో అదానీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ప్రకటించారు. రాబోయే పది సంవత్సరాల్లో ఏపీలో మొత్తం రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రాజెక్టులు నిలువబెట్టాలని గ్రూప్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!