

సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ చిట్టంపల్లి స్వామిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. భూ సమస్య పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చిన ఓ రైతుతో ఆయన అనుచితంగా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ‘ఇంకా చనిపోలేదా?’ అంటూ రైతును అవమానించినట్లు సమాచారం. తన సమస్యను పరిష్కరించుకోవడానికి వచ్చిన రైతుతో తహసీల్దార్ వ్యవహరించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. చిట్టంపల్లి స్వామిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు, ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాలకు సమస్యల పరిష్కారం కోసం వచ్చే రైతులతో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అంశంపై ఈ ఘటన చర్చకు దారితీసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!