

గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్లోని 25 మంది ఎంపీల పనితీరు సర్వేలో 8.9 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా నుంచి తిరిగి వచ్చి 2024 ఎన్నికల్లోనే తొలిసారి రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటికీ, కేవలం కొన్ని నెలల్లోనే ఆయన ప్రజల నుంచి బలమైన మద్దతు పొందారు.
అనవసర రాజకీయ కొట్లాటలకు దూరంగా ఉండటం, వ్యక్తిగత దూషణలు మానేయడం, ప్రజలతో ఎక్కువ సమయం గడపడం ఆయన విజయ రహస్యం. అమరావతి పరిధిలోని ఎంపీగా రైతుల ఆందోళనలను నేరుగా విని, రాజధాని అంశంపై హామీలిచ్చారు. రోడ్లు, ఫ్లైఓవర్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర నిధులతో పాటు ఎంపీ నిధులనూ సమర్థవంతంగా ఉపయోగించారు. ఈ చిత్తశుద్ధితో కూడిన కృషి ప్రజలు గుర్తించి, రాష్ట్రంలోనే అత్యధిక స్కోరు ఇచ్చారు. ప్రస్తుత ప్రజాభిప్రాయం ప్రకారం వచ్చే ఎన్నికల్లోనూ ఆయన బలమైన అభ్యర్థిగానే కొనసాగే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!