
ఓటీటీ

ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మేజర్ జనరల్ (రిటైర్డ్) భువన్ చంద్ర ఖండూరి మంగళవారం 91 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డెహ్రడూన్‌లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై రాజకీయ నాయకులు, ఉత్తరాఖండ్ ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
భువన్ చంద్ర ఖండూరి బీజేపీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఆయన రెండు సార్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. రాజకీయాల్లోకి రాకముందు భారత సైన్యంలో మేజర్ జనరల్‌గా పనిచేసి “జనరల్ సాబ్”గా ప్రసిద్ధి పొందారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!