
జనరల్

మాజీ మంత్రి, కాపు ఉద్యమ ప్రముఖ నేత ముద్రగడ పద్మనాభం శ్వాసకోశ సంబంధిత అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా కాపు ఉద్యమంలోనూ ఒక కీలక అధ్యాయం ముగిసింది.
1953లో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం 1978లో జనతా పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ఎన్టీఆర్, చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!