
సినిమాలు

సీఎం రేవంత్ రెడ్డి పేరు ఒకే EPIC నంబర్‌తో రెండు చోట్ల ఓటరు జాబితాలో కనిపించడం కేవలం రోల్ అనామలీ మాత్రమేనని భారత ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఒకే EPIC నంబర్ ఉండటం వల్ల రెండు చోట్ల ఓటు హక్కు లభించినట్లు కాదని ఈసీ వెల్లడించింది.
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో డూప్లికేట్, పాత, తప్పు నమోదులను గుర్తించి నిబంధనల ప్రకారం సరిచేస్తున్నట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. వలసలు, రికార్డుల నవీకరణ ఆలస్యం కారణంగా ఇలాంటి డూప్లికేట్ నమోదులు జరిగే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సీఎం కుటుంబం కొండంగల్‌లో ఓటరు నమోదును కొనసాగించాలని, కొండారెడ్డిపల్లి నమోదును తొలగించాలని కోరినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!